Telangana TSSPDCL Recruitment 2022 Registration Process Begin: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) విడుదల చేసిన 70 అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer posts) పోస్టులకు రాతపరీక్ష జులై 17న నిర్వహించనున్నట్లు బుధవారం (మే 12)న ప్రకటించింది. ఈ సంస్థ పరిధిలోని మొత్తం 15 జిల్లాల్లో 70 ఏఈ పోస్టుల భర్తీకి మే 11న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 11 నుంచి జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను జులై 11 నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని తెల్పింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుతో బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ చదివిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 70 పోస్టుల్లో 16 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇవికాక ఓపెన్ కేటగిరీలో మరో 9 పోస్టులు మహిళలకు రిజర్వు చేశారు. మిగతావన్నీ వివిధ వర్గాలకు రిజర్వు చేశారు. సబ్ ఇంజినీరు పోస్టుల భర్తీకి సైతం విడిగా ప్రకటన జారీచేస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఆ వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also Read: