నిరుద్యోగులకు మరోసా గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 23 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు TSPSC ప్రకటించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది టీఎస్‌పీఎస్సీ. 23 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మరిన్ని పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టులను భర్తీ చేసేందుకు 23 ఖాళీలతో నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్త కోసం..