TSPSC Group 1 2022: జూన్‌ 4 వరకు టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంపు.. త్వరలో ఎడిట్‌ ఆప్షన్‌ కూడా..

|

Jun 01, 2022 | 4:09 PM

గ్రూప్‌ 1 దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు పుట్టిన తేదీ, అర్హతలు, తదితర వివరాలు నమోదు చేయడంలో పొరపాట్లు దొర్లాయని, తప్పుల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌ (Group 1 Edit Option) ఇవ్వవలసిందిగా..

TSPSC Group 1 2022: జూన్‌ 4 వరకు టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంపు.. త్వరలో ఎడిట్‌ ఆప్షన్‌ కూడా..
Tspsc Group 1
Follow us on

TSPSC Group-1 2022 application last date extended till June 4: తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్‌1 పోస్టులకు దరఖాస్తు గడువును మరో 4 రోజుల పాటు.. అంటే జూన్‌ 4వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు చివరి తేదీని పొడిగించినట్లు కమిషన్‌ (TSPSC) తెల్పింది. అంతేకాకుండా గ్రూప్‌ 1 దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు పుట్టిన తేదీ, అర్హతలు, తదితర వివరాలు నమోదు చేయడంలో పొరపాట్లు దొర్లాయని, తప్పుల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌ (Group 1 Edit Option) ఇవ్వవలసిందిగా కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై కమిషన్‌ సానుకూలంగా స్పందించనున్నట్లు సమాచారం.

టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తు గడువు పొడిగింపు.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు
కాగా మే 31వ తేదీ రాత్రి 11 గంటల నాటికి రికార్డు స్థాయిలో.. అంచనాలకు మించి 3,48,095ల మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రెండురోజుల్లోనే 1,33,598ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1కు గరిష్ఠ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి. ఇంకా కొంత మంది చివరి నిముషంలో సర్వర్ బిజీ సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామని విన్నవించుకోవడంతో గడువును పొడిగించింది. దీంతో రాత్రి 11 గంటల 30 నిముషాల తరువాత గడువును జూన్‌ 4 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ, మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది.

5 లక్షల దరఖాస్తులు?
2011లో ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి గ్రూప్‌-1 కింద 312 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే అప్పట్లో 3,02,912 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 2022 నోటిఫికేషన్‌కు ఏకంగా వచ్చిన 3,48,095ల దరఖాస్తులు ఉమ్మడి రాష్ట్ర రికార్డును బద్దలుకొట్టాయి. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సుదీర్ఘ విరామం తరువాత ప్రకటన రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక తాజాగా దరఖాస్తు గడువును పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.