TS SSC Result Time 2025: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే

ఎప్పుడెప్పుడాని దాదాపు నెల రోజులుగా ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పదో తరగతి విద్యార్ధులకు నిరీక్షణ తప్పేలా లేదు. బుధవారం (ఏప్రిల్ 30) వెల్లడిస్తామని చెప్పిన విద్యాశాఖ తాజాగా మరో బాంబ్ పేల్చింది. దీంతో ఫలితాల వెల్లడి అంతకంత వెనక్కి జరుగుతుంది. అసలింతకీ ఎన్ని గంటలకు ఫలితాలు వెల్లడిస్తారంటే..

TS SSC Result Time 2025: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
Telangana SSC 10th Class Results

Updated on: Apr 30, 2025 | 3:04 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు నిరీక్షణ తప్పేలాలేదు. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తొలుత ప్రకటించినప్పటికీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు ఆలస్యంగా విడుదల చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఫలితాల వెల్లడి మరికాస్త ఆలస్యమవుతుందని మరోమారు ప్రకటించింది. దీంతో విద్యార్ధులు ఫలితాలు అసలెప్పుడు వస్తాయో తెలియక తికమకపడుతున్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు

తాజా సమాచారం ప్రకారం తెలంగాణ పదో తరగతి పలితాలు ఈ రోజు మధ్యాహ్నం 2.15 కి విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ ఫలితాలు వెల్లడి చేయేనున్న కారణంగానే ఆలస్యం నెలకొంది. సీఎం రేవంత్ కు ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మద్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ చేరుకుంటారు. అనంతరం మొయినాబాద్, గుడి మల్కాపూర్ లో రెండు వివాహా వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 కి రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఫలితాల వెల్లడి అనంతరం టీవీ 9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలో కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.