Telangana: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల 2022-23కు దరఖాస్తు గడువు పెంపు!

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగిస్తూ..

Telangana: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల 2022-23కు దరఖాస్తు గడువు పెంపు!
Telangana Jobs

Updated on: Mar 29, 2022 | 6:48 AM

TS Gurukula 5th class admission 2022 last date: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగిస్తూ సెట్‌ కన్వినర్‌ రోనాల్డ్‌రాస్‌ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన విద్యార్ధులు ఎవరైనా ఉంటే ఏప్రిల్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 8న పరీక్ష నిర్వహస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీల అధికార వెబ్‌సైట్‌ లేదా 180042545678 నంబర్లను సంప్రదించవచ్చు.

కాగా కేజీ టూ పీజీ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివస్తున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిదిగా ఈ సందర్భంగా సెట్ కన్వినర్‌ తెలియజేశారు.

Also Read:

Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!