NEET Counselling 2024: నీట్‌ ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు సిద్దమేనా? ఈ సర్టిఫికెట్‌లు తప్పనిసరి

|

Aug 11, 2024 | 6:24 AM

దేశ వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్‌ యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ సీట్లకు ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎంబీబీఎస్, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని..

NEET Counselling 2024: నీట్‌ ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు సిద్దమేనా? ఈ సర్టిఫికెట్‌లు తప్పనిసరి
NEET UG Counselling
Follow us on

ఢిల్లీ, ఆగస్టు 11: దేశ వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్‌ యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ సీట్లకు ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎంబీబీఎస్, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డాక్టర్‌ ఎన్టీఆర్‌, కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీలు ప్రవేశాల నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ఆగస్టు 14 నుంచి 21వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్ధులు ఆగస్టు 24 నుంచి 29వ తేదీలోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 5వ తేదీన రిజిస్ట్రేషన్‌ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 13న సీట్లకు ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్‌ 14 నుంచి 20లోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు జరుగుతుంది. అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 24 నుంచి 30వ తేదీలోపు కాలేజీల్లో చేరాలి. ఇలా మొత్తం మూడు రౌండ్లలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు కింది ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నీట్‌ కౌన్సెలింగ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన సర్టిఫికెట్‌లు ఇవే..

  • నీట్‌ యూజీ 2024 ర్యాంక్‌ కార్డు
  • నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌ కార్డు
  • నీట్‌ యూజీ 2024 డొమిసైల్ సర్టిఫికేట్
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
  • మైగ్రేషన్ సర్టిఫికెట్‌
  • మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌
  • పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • ఆధార్‌ కార్డు
  • ఇన్‌కాం సర్టిఫికెట్‌
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ సర్టిఫికెట్‌

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.