AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) DIETల్లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, వయోపరిమితి, జీతం, దరఖాస్తు విధానం వివరాలు ఈ కింద తెలుసుకోండి. దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
TGPSC DIET Lecturers Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 28, 2026 | 3:39 PM

Share

ఉపాధ్యాయులుగా విద్యా రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET)ల్లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 86 సీనియర్‌ లెక్చరర్లు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వానీగా పోస్టుల వివరాలు..

  • సీనియర్ లెక్చరర్, DIET పోస్టుల సంఖ్య: 23
  • లెక్చరర్ (సర్వీస్ ట్రైనింగ్/DRU తదితర విభాగాలు) పోస్టుల సంఖ్య: 16
  • లెక్చరర్- ఎడ్యుకేషన్ పోస్టుల సంఖ్య: 2
  • లెక్చరర్-ఎడ్యుకేషన్ (ఉర్దూ మీడియం) పోస్టుల సంఖ్య: 4
  • లెక్చరర్ (ఇంగ్లిష్) పోస్టుల సంఖ్య: 3
  • లెక్చరర్ (తెలుగు) పోస్టుల సంఖ్య: 8
  • లెక్చరర్ (ఉర్దూ) పోస్టుల సంఖ్య: 1
  • లెక్చరర్ (మ్యాథ్స్) పోస్టుల సంఖ్య: 3
  • లెక్చరర్ (సైన్స్) పోస్టుల సంఖ్య: 3
  • లెక్చరర్ (సోషల్ స్టడీస్) పోస్టుల సంఖ్య: 3
  • లెక్చరర్ (సైకాలజీ) పోస్టుల సంఖ్య: 3
  • వీటితోపాటు ఇతర విభాగాలైన ఫిలాసఫీ, ప్లానింగ్ & స్టాటిస్టిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి.

సీనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి, M.Ed అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 50 శాతంగా నిర్ణయించారు. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు M.Ed. అర్హత తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 29, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద OC/BC అభ్యర్థులు రూ.1,000, SC/ ST/ PwD అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దీనితోపాటు అదనంగా పరీక్ష ఫీజు రూ.120 చొప్పున ప్రతి ఒక్కరూ చెల్లించాలి. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష (CBRT/OMR) ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి సీనియర్ లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు, లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష నవంబర్ 2026లో ఉంటుంది. ఉపాధ్యాయ విద్యా రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి, అర్హత కలిగిన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ TGPSC డీఐఈటీ (DIET)లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!