TGPSC Group 3 Verification Postponed: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 అభ్యర్థులకు బిగ్‌షాక్‌.. ధ్రువపత్రాల పరిశీలన వాయిదా!

గ్రూప్‌ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన జారీ చేసింది. ఇటీవల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 18 నుంచి జులై 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని భావించారు. అయితే ఈ ధ్రువపత్రాల పరిశీలన..

TGPSC Group 3 Verification Postponed: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 అభ్యర్థులకు బిగ్‌షాక్‌.. ధ్రువపత్రాల పరిశీలన వాయిదా!
TGPSC Group 3 certificate verification

Updated on: Jun 12, 2025 | 9:53 AM

అమరావతి, జూన్‌ 12: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన జారీ చేసింది. ఇటీవల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 18 నుంచి జులై 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని భావించారు. అయితే ఈ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వాయిదా పడినట్లు టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది.

గ్రూప్‌ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభిచేందుకు ముందు గ్రూప్‌ 2 నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ పేర్కొంది. దీంతో ఈ మేరకు గ్రూప్‌ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ మంగళవారం రాత్రి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనను జారీ చేసింది. త్వరలోనే గ్రూప్‌ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డా నవీన్‌ నికోలస్‌ పేర్కొన్నారు.

ఎస్‌బీఐ క్లర్క్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి జాబితా ఇదిగో!

ఎస్‌బీఐలో క్లర్క్స్‌ (జూనియర్‌ అసోసియేట్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలైనాయి. ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన అభ్యర్ధుల ప్రాథమిక రోల్‌ నంబర్లతో కూడిన జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా మొత్తం 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌ ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ జారీ అయింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1వరకు ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. మార్చి నెలాఖరులో ఫలితాలను వెల్లడించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్వేజ్‌ ప్రొఫిసియెన్సీ టెస్ట్ నిర్వహించి తుది ఫలితాలను వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ క్లర్క్స్‌ మెయిన్స్‌ 2025 మెరిట్ టిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.