TS EAPCET 2025 Result Date: ఈఏపీసెట్‌ ఫలితాల వెల్లడి తేదీ వచ్చేసింది.. మరికాసేపట్లో ఆన్సర్‌ కీ విడుదల

TG EAPCET 2025 Result Date: వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ మే 5 (సోమవారం) విడుదలైంది. ఇప్పటికే అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. నేటి సాయంత్రానికి ఇంజినీరింగ్‌..

TS EAPCET 2025 Result Date: ఈఏపీసెట్‌ ఫలితాల వెల్లడి తేదీ వచ్చేసింది.. మరికాసేపట్లో ఆన్సర్‌ కీ విడుదల
Telangana EAPCET 2025

Updated on: May 06, 2025 | 4:36 PM

హైదరాబాద్‌, మే 5: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ మే 5 (సోమవారం) విడుదలైంది. ఇప్పటికే అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. నేటి సాయంత్రానికి ఇంజినీరింగ్‌ విభాగం ‘కీ’ విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య డీన్‌కుమార్, కో కన్వీనర్‌ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాథమిక ‘కీ’తోపాటు మాస్టర్‌ ప్రశ్నపత్రం, విద్యార్థుల రెస్పాన్స్‌షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆన్సర్‌ కీపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యంతరాలను లేవనెత్తేందుకు జేఎన్టీయూ అవకాశం ఇచ్చింది. ఒక్కొ ప్రశ్నకు రూ. 500 చెల్లించి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని పేర్కొంది. అభ్యంతరం సరైనదిగా తేలితే ఫీజు తిరిగి చెల్లిస్తామని, లేదంటే రూ. 500 వెనక్కి రావని తెల్పింది. ఇక ఇంజినీరింగ్‌ ప్రాథమిక ‘కీ సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. దీనిపై విద్యార్థులు మే 7వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈఏపీసెట్‌ ఫలితాలు మే 15న విడుదలకానున్నాయి. 15న ఉదయం ఫలితాలు విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్‌ 29న ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగం పరీక్షలకు మొత్తం 93.59 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలకు 94.04 శాతం విద్యార్థులు హాజరైనట్టు జేఎన్టీయూ అధికారుల ప్రకటించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీకి 86,762 మందికి 81,198 మంది హాజరుకాగా.. 5,564 మంది గైర్హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలకు 2,20,327 మంది దరఖాస్తు చేయగా.. వీరిలో 2,07,190 మంది పరీక్షలు రాశారు. 13,137 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.