తెలంగాణలో ఎట్టకేలకు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. రెండు రోజుల పాటు అప్లికేషన్స్ తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు టెక్‌కు సంబంధించి నోటిఫికేషన్ రావడం, అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్ టికెట్పై అభ్యర్థి ఫొటో రాకపోయినా, ఫొటో స్పష్టంగా లేకపోయినా.. హాల్ టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకోవాలని తెలిపారు. అనంతరం సదరు హాల్ టికెట్ను డీఈవోకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని పరిశీలించిన తర్వాత పరీక్షకు అనుమతిస్తారు.
ఇదిలా ఉంటే టెట్ పరీక్షను రెండు పేపర్లు నిర్వహించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబ్ 15వ తేదీన ఉయదం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్2 పరీక్షను నిర్వహిస్తారు. ఇక రిజల్ట్స్‌ను ఇదే నెల 27న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా టెట్ 2023 దరఖాస్తల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు కొనసాగగా మొత్తం 2,83,620 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం 150 మార్కులకు గాను ఈ పరీక్ష ఉండనుంది. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..