TS TET Exam: చాలా కాలం తర్వాత తెలంగాణలో టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించిన విషయం తెలిసిందే. మార్చి 24న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే పరీక్షా ఫలితాలను జూన్ 27న విడదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. అయితే ఆదివారం కూడా టెట్ ఫలితాల విషయమై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో విడుదల వాయిదా పడినట్లే తెలుస్తోంది.
దాదాపు ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టెట్ పరీక్షకు భారీ ఎత్తున అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫలితాల వాయిదాపై టెట్ కన్వీనర్ రాధారెడ్డి స్పందించారు. సోమవారం ఫలితాలు విడుదల చేయలేక పోతున్నామని. తదుపరి తేదీ ఖరారైన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం (రేపు) తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి టెట్ రిజల్ట్స్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదల చేసిన టెట్ కీ పేపర్ 1లో సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే పేపర్ 2లో ఫైనల్‌కీలో కూడా 5 సమాధానల్లో తప్పులు ఉన్నాయనే వాదన వినిపించాయి. దీంతో వీటిపై ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..