TS SSC Results 2022: తెలంగాణ టెన్త్ ఫలితాలను టీవీ9 వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి.. ఎంత మంది పాస్ అయ్యారంటే..

|

Jun 30, 2022 | 2:23 PM

Telangana 10th Class Results Live Updates: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈసారి ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు...

TS SSC Results 2022: తెలంగాణ టెన్త్ ఫలితాలను టీవీ9 వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి.. ఎంత మంది పాస్ అయ్యారంటే..
Results Ts Ssc

Telangana 10th Class Results: Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో కూడా బాలికలే సత్తాచాటారు. మొత్తం మీద 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి యథావిథిగా పరీక్షలను నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది. అత్యధికమంది బాలికలే ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

 

ఫలితాలను నేరుగా Tv9 Telugu వెబ్‌సైట్‌ లో తెలుసుకోండి.  మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలకు మొత్తం 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఎలాంటి పరీక్షలు లేకుండా పాస్‌ అయిన విద్యార్థులు ఈసారి పరీక్షలు రాసారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను Tv9 Telugu తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jun 2022 11:55 AM (IST)

    టెన్త్ క్లాస్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

  • 30 Jun 2022 11:55 AM (IST)

    సిద్ధిపేట ఫస్ట్‌.. హైదరాబాద్‌ లాస్ట్‌..

    తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలవడానికి కారణమేంటన్న అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  • 30 Jun 2022 11:45 AM (IST)

    విద్యార్థులు అధైర్య పడొద్దు..

    పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారికోసం స్పెషల్‌ క్లాసెస్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సున్నా, 1 మార్కుల విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వెరిఫికేషన్‌ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక విద్యార్థులు కూడా అధైర్య పడొద్దని, కష్టపడి సప్లీలు రాసుకోవాలని సూచించారు. ఓటమి గెలుపునకు తొలి మెట్టు అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, పేరెంట్స్‌, టీచర్లు విద్యార్థుల వెనకా ఉన్నారని ధైర్యం నూరిపోశారు.

  • 30 Jun 2022 11:39 AM (IST)

    ఎంత మంది పాస్‌ అయ్యారంటే..

    ఈ ఏడాది మొత్తం 5,03,579 విద్యార్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరుకాగా 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతం మంది ఉత్తీర్ణత శాతం సాధించారు. వీరిలో అబ్బాయిలు 2,55,433 అబ్బాయిలు హాజరుకాగా 2,23,779 (87.61 శాతం) మంది పాస్‌ అయ్యారు. 2,48,146 అమ్మాయిలు 2,29,422 (92.45) మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 30 Jun 2022 10:54 AM (IST)

    ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం..

    తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • 30 Jun 2022 10:45 AM (IST)

    ఎంత మంది పరీక్ష రాశారంటే..

    ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహించడంతో ఫలితాలపై అందరి దృష్టి పడింది.

  • 30 Jun 2022 10:16 AM (IST)

    విద్యా సంవత్సరం కోల్పోకుండా..

    ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు విద్యా సంవ‌త్సరం కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు స‌ప్లమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించ‌నుంది. ఈ ఫ‌లితాలు ప్రక‌టించిన కొన్ని రోజుల్లోపే స‌ప్లమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించాల‌ని ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు రావాలనే విషయం తెలిసిందే.

  • 30 Jun 2022 09:40 AM (IST)

    ఏ మార్కులకు ఏ గ్రేడ్‌ ఇస్తారంటే..

    సెకండ్‌ లాంగ్వేజ్‌లో..

    90-100 (A1), 79-89 (A2), 68-78 (B1), 57-67 (B2), 46-56 (C1), 35-45 (C2), 20-34 (D), 0-19 (E).

    ఇతర సబ్జెక్టుల్లో..

    91-100(A1), 82-90 (A2), 71-80 (B1), 61-70 (B2), 51-60 (C1), 41-50 (C2), 35-40 (D), 0-34 (E)

Follow us on