AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో 7వేల ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..

ఖాకీ చొక్కా వేసుకోవాలనేది మీ కలనా? పోలీస్ కొలువు కోసం రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నావా? అయితే మీకో గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖలో ఏకంగా 7 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో 7వేల ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..
Telangana Police Recruitment 2026
Krishna S
|

Updated on: Jul 04, 2026 | 9:56 AM

Share

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో దాదాపు 7 వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. హోంశాఖలో ఉద్యోగాల భర్తీ కోరుతూ గత కొద్దిరోజులుగా అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రెండు విడతల్లో చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 వేల పోలీస్‌ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ కాగా ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన మిగిలిన 2 వేల పోస్టుల కోసం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిన వెంటనే, తెలంగాణ పోలీస్‌ నియామక మండలి మరొకట్రెండు రోజుల్లోనే అధికారికంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెలువరించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

ఉద్యోగాలు ఇలా..

ప్రభుత్వం జీవో ప్రకారం.. 5 వేల పోలీస్ ఉద్యోగాల్లో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 148 సివిల్ ఎస్సై, 24 ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్, 23 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 20 కానిస్టేబుల్ పీటీఓ, 14 ఏఆర్ ఎస్సై, 12 టీజీఎస్పీ ఏఆర్ఎస్సై, 7 కానిస్టేబుల్ పీటీఓ, 3 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై పోస్టులు ఈ జాబితాలో చేరి ఉన్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోంశాఖలో వెలువడుతున్న నాలుగో అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. గతంలో తొలిసారిగా 2015న 9,281 పోస్టులతో, ఆ తర్వాత 2018లో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులతో రెండో నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం మూడోసారి 2022లో 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం రాబోయే 7 వేల పోస్టుల నోటిఫికేషన్ అభ్యర్థులకు మరో సువర్ణావకాశంగా మారనుంది.

Follow Us
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
ఆకట్టుకుంటున్న 'నారాయణమ్మ' సాంగ్!
ఆకట్టుకుంటున్న 'నారాయణమ్మ' సాంగ్!
ఆ ఒక్క సినిమాతో రోడ్డున పడిపోయా..
ఆ ఒక్క సినిమాతో రోడ్డున పడిపోయా..
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11