Telangana: తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం..

|

Oct 19, 2021 | 8:56 AM

TS Medical Colleges Recruitment: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాల్లో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను..

Telangana: తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం..
Ts Medical Colleges
Follow us on

TS Medical Colleges Recruitment: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాల్లో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 15 డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.

* అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియాలజీ, రేడియోడయాగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగాల్లో అధ్యాపకుల నియామకం చేపట్టనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత ఆసక్తి ఉన్న అ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్‌ 31న ప్రకటిస్తారు. నవంబర్‌ 7లోగా పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు వనపర్తి, నాగర్‌కర్నూల్‌; మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, రామగుండం మెడికల్‌ కాలేజీల్లో ఎందులోనైనా పని చేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాధాన్యం ప్రకారం కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

* దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు లేకపోతేనే ఇతర రాష్ర్టాల అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ప్రొఫెసర్‌ పోస్టుకు ఎంపికై వారికి నెలకు రూ. 1.9 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.5 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Mahesh Babu: మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్న మహేష్‌ బాబు.. ఈసారి మెగా ప్రొడ్యుసర్‌తో చేతులు కలపనున్న ప్రిన్స్‌..

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..