
హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( TG EAPCET ) 2026 మే మొదటి వారంలో నిర్వహించబడే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలోప్రవేశాలకు ప్రవేశ పరీక్షలను మే 4 లేదా 5 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ దిశగా కౌన్సిల్ ప్రాథమిక షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం విద్యామండలి పంపించింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాకుండా వచ్చే మే నెలలో EdCET, LAWCET, ICET, PGECET, ECET, PECET లను నిర్వహించే అవకాశాలపై కూడా TGCHE కసరత్తు చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనుంది.
ఇక JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే వచ్చే ఏడాదికి కూడా TG EAPCET 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలకు కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.