TS Inter Board: ఆలస్యంకానున్న తెలంగాణ ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం..ఎందుకంటే..

|

May 13, 2022 | 1:56 PM

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల కారణంగా ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలో మే 23 నుంచి..

TS Inter Board: ఆలస్యంకానున్న తెలంగాణ ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం..ఎందుకంటే..
Inter Academic Year
Follow us on

Telangana intermediate colleges opening date 2022: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల కారణంగా ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 12-13 తేదీల్లో టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభించడం సాధ్యం కాదు.

కోవిడ్ కారణంగా 2021-22 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయినందున.. ఈ ఏడాది జూన్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం త్వరలో పంపనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించి, జూనియర్ కాలేజీకి ఏ స్ట్రీమ్‌ను ఎంచుకోవాలో మార్గనిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూధన్ రెడ్డి అన్నారు.

Also Read:

ఇవి కూడా చదవండి

NHM Telangana Jobs 2022: తెలంగాణ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..