Telangana Inter Results 2026 Live: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Telangana Intermediate Board Results 2026 Live Updates: ఎప్పుడెప్పుడాని దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డు ఉదయం 11 గంటలకు ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి..

Telangana Inter Results 2026 Live: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
Telangana Inter Results

Updated on: Apr 12, 2026 | 12:16 PM

LIVE NEWS & UPDATES

  • 12 Apr 2026 12:16 PM (IST)

    మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్

    ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభ మవుతాయి. రోజుకు రెండు సెషన్స్ లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

  • 12 Apr 2026 11:46 AM (IST)

    రేపట్నుంచే ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు దరఖాస్తులు

    ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఏప్రిల్ 13, 2026 (సోమవారం) నుంచి ఏప్రిల్ 20, 2026వ తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

  • 12 Apr 2026 11:45 AM (IST)

    తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ 2026

    ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు మే 13, 2026వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. రోజుకు రెండు సెషన్లలో మే 22, 2026వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

  • 12 Apr 2026 11:43 AM (IST)

    రేపట్నుంచే రీకౌంటిక్‌, రీ వెరిఫికేషన్‌కు చాన్స్.. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే?

    ఇంటర్ విద్యార్ధుల్లో ఏవరైనా రీకౌంటిక్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలనుకుంటే ఏప్రిల్ 13 నుంచి అంటే రేపట్నుంచే (సోమవారం) నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఏప్రల్ 20, 2026వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. విద్యార్ధులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా రీకౌంటిక్‌, రీ వెరిఫికేషన్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్కు రీకౌంటింగ్‌కు రూ.100, స్కాన్డ్ కాపీ కమ్‌ రీవెరిఫికేషన్‌కు అయితే ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజుగా చెల్లించాలి.

  • 12 Apr 2026 11:38 AM (IST)

    వాట్సాప్‌లోనూ ఇంటర్ ఫలితాలు..

    ఇంటర్‌ ఫలితాలను వాట్సాప్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లో 80969 58096 సెల్‌ నంబర్‌కు ‘Hi’ అని టైప్‌ చేసి సెండ్ చేయాలి. మెనూలో బీఐఈ ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ ఎంచుకుని.. విద్యార్ధులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, ఫస్టియర్‌/సెకండియర్‌, జనరల్‌/వొకేషనల్‌ స్ట్రీమ్‌ ఆప్షన్లు ఇస్తే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

  • 12 Apr 2026 11:36 AM (IST)

    అమ్మాయిలు 74.4 శాతం.. అబ్బాయిలు 57.69 శాతం ఉత్తీర్ణత

    ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.5 లక్షల మంది హాజరవగా.. ఇందులో ఫస్టియర్‌లో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 3,58,490 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికలు 74.4 శాతం మంది, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 12 Apr 2026 11:35 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ టాప్.. చివరి స్థానంలో ఆ జిల్లా!

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 82.73 శాతం మార్కులతో అత్యధిక మంది విద్యార్దులు ఉత్తీర్ణత పొందారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.

  • 12 Apr 2026 11:32 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో 2026 అమ్మాయిల సత్తా.. అన్ని జిల్లాల్లో టాపర్లు వీరే

    తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ రోజు విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 66.20శాతం, సెకండ్‌ ఇయర్‌లో 70.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో గతంలో మాదిరి ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40 శాతం ఉండగా వీరిలో బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది.

    ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో మొత్తం 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,58,490 మంది (70.58శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం, బాలుర ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది.

  • 12 Apr 2026 11:29 AM (IST)

    ఇంటర్ 2026 మార్కుల మెమోల డౌన్‌లోడ్‌ ఎప్పట్నుంచంటే?

    తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులకు సబ్జెక్ట్‌ వైజ్‌ మార్కుల మెమోలను ఆదివారం (ఏప్రిల్ 12) సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • 12 Apr 2026 11:27 AM (IST)

    మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్‌ అయ్యామని భయం వద్దు.. ఈ నెంబర్ కి కాల్ చేయండి

    పరీక్షలు, ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమే. అవే మన గమ్యాన్ని నిర్ధారించవు. కాబట్టి విద్యార్ధులు ఎవరైనా ఆందోళన చెందితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలీ మానస్‌ నెంబర్‌కి 14416 కాల్ చేయండి.

  • 12 Apr 2026 11:24 AM (IST)

    ఇంటర్ ఫలితాలపై ఫిర్యాదు చేయాలంటే ఈ కింది నెంబర్‌కి కాల్‌ చేయండి.

    ఆదివారం ఉదయం విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్ధులు సత్తా చాటారు. అయితే ఈ ఫలితాల్లో ఎవరికైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే ఇంటర్ బోర్డు జారీ చేసిన ఈ కింది ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

    • హెల్ప్‌ లైన్‌ నెంబర్‌: 040-24655027.
    • IVRS contact number: 9240205555.

     

  • 12 Apr 2026 11:21 AM (IST)

    గతేడాది కంటే ఈసారి పెరిగిన ఇంటర్ ఇత్తీర్ణత శాతం.. ఈ సారి ఎంతో తెలుసా?

    గతేడాది కంటే ఈ సారి తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2025లో కేవలం 67.45 శాతం మంది ఉత్తీర్ణత పొందగా.. 2026 సంవత్సరానికి ఏకంగా 71.15 శాతం మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు.

  • 12 Apr 2026 11:19 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా..

    ఇంటర్ ఫలితాలు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 66.20 శాతం. అమ్మాయిలు 74.40 శాతం, అబ్బాయిలు 57.69 శాతం మంది ఉత్తీర్ణత  పొందారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 70.58 శాతం ఉత్తీర్ణత పొందగా.. ఇందులో అమ్మాయిలు 78.65 శాతం,  అబ్బాయిలు 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 12 Apr 2026 11:17 AM (IST)

    ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 66.94 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 70.52 మంది ఉత్తీర్ణత

    తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 75.61 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 66.94 శాతం మంది, సెకండ్‌ ఇయర్‌లో 70.52 మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 12 Apr 2026 11:14 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాల 2026 లింక్ ఇదే

    తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

  • 12 Apr 2026 11:08 AM (IST)

    9.5 లక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేశాయ్

    తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ప్రభుత్వ సలహారు కె.కేశవరావు విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలు విడుదల చేశారు. 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారు. ఈ మేరకు ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలు వెల్లడించారు.

  • 12 Apr 2026 11:06 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 70.58 ఉత్తీర్ణత

    రాష్ట్రంలో ఈ రోజు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో 70.58 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

  • 12 Apr 2026 11:04 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల

    తెలంగాణ ఇంటర్తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేకే , విద్యా శాఖ కార్యదర్శి యోగిత రానా. ఒకేసారి

    ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేశారు.

     

  • 12 Apr 2026 11:01 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల

    విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. విద్యార్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు.

     

  • 12 Apr 2026 10:53 AM (IST)

    మరికొన్ని నిమిషాల్లోనే ఉత్కంఠకు తెర

    తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల నిరీక్షణకు మరికొన్ని నిమిషాల్లోనే తెరపడనుంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

  • 12 Apr 2026 10:32 AM (IST)

    అందుకే.. ఇంటర్ ఫలితాల 2026 విడుదల సమయంలో మార్పు!

    వాస్తవానికి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని తొలుత అధికారులు ప్రకటించారు. అయితే  అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదగా ఉదయం11 గంటలకే ఫలితాలు వెల్లడించాలని ముహూర్తాన్ని ఖరారు చేశారు.

  • 12 Apr 2026 10:29 AM (IST)

    తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల ప్రత్యక్ష ప్రసారం వీడియో ఇక్కడ చూడండి

  • 12 Apr 2026 10:21 AM (IST)

    ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల

    ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా విడుదల చేయనునున్నారు.

  • 12 Apr 2026 10:19 AM (IST)

    తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

    తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి.

Follow Us