TS Inter Hall Tickets 2024
హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 28 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను మంగళవారం (ఫిబ్రవరి 20) ఇంటర్ బోర్డు విడుదల చేసింది. టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరిచారు. జూనియర్ కాలేజీల లాగిన్ ఐడీను నమోదు చేసి విద్యార్ధుల హాల్ టికెట్లను సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2024 పబ్లిక్ పరీక్షల తేదీలు ఇవే
- ఫిబ్రవరి 28వ తేదీన (పార్ట్ 2) సెకండ్ లాంగ్వేజి పేపర్ 1 పరీక్ష
- మార్చి 1వ తేదీన (పార్ట్ 1) ఇంగ్లిష్ పేపర్ 1 పరీక్ష
- మార్చి 4వ తేదీన (పార్ట్ 3) మేథమేటిక్స్ పేపర్ 1ఏ/బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్-1 పరీక్షలు
- మార్చి 6వ తేదీన మేథమేటిక్స్ పేపర్ 1బి/జువాలజీ పేపర్-1/హిస్టరీ పేపర్ 1 పరీక్షలు
- మార్చి 11వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1/ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు
- మార్చి 13వ తేదీన కెమెస్ట్రీ పేపర్ 1/కామర్స్ పేపర్ 1 పరీక్షలు
- మార్చి 15వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1/ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 (For BiPC Students) పరీక్షలు
- మార్చి 18వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1/జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ 2024 పబ్లిక్ పరీక్షల తేదీలు ఇవే
- ఫిబ్రవరి 29వ తేదీన (పార్ట్ 2) సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
- మార్చి 2వ తేదీన (పార్ట్ 1) ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
- మార్చి 5వ తేదీన (పార్ట్ 3) మేథమేటిక్స్ పేపర్ 2ఏ/బోటనీ పేపర్ 2/పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలు
- మార్చి 7వ తేదీన మేథమేటిక్స్ పేపర్ 2బి/ జూవాలజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 పరీక్షలు
- మార్చి 12వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2/ ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు
- మార్చి 14వ తేదీన కెమెస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2 పరీక్షలు
- మార్చి 16వ తేదీన పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ పేపర్ 2/ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 (For BiPC Students) పరీక్షలు
- మార్చి 19వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2/ జియోగ్రఫీ పేపర్-2 పరీక్షలు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.