TS High Court Jobs 2023: తెలంగాణ నిరుద్యోగులకు సంక్రాంతి కానుక! ఒకేసారి 9 జాబ్‌ నోటికేషన్లు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌తోపాటు పలు పోస్టుల భర్తీకి బుధవారం (జ‌న‌వ‌రి 11) దాదాపు 9 నోటిఫికేషన్‌లను విడుదల చేసింది..

TS High Court Jobs 2023: తెలంగాణ నిరుద్యోగులకు సంక్రాంతి కానుక! ఒకేసారి 9 జాబ్‌ నోటికేషన్లు జారీ చేసిన హైకోర్టు
Telangana High Court
Image Credit source: TV9 Telugu

Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2023 | 3:04 PM

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌తోపాటు పలు పోస్టుల భర్తీకి బుధవారం (జ‌న‌వ‌రి 11) దాదాపు 9 నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 176 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో మహిళలకు 72 వరకు కేటాయించడం జరిగింది.

హైకోర్టు సబార్డినేట్‌ పోస్టులు, సిస్టం అసిస్టెంట్‌లు, ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌లు, యూడీ స్టెనోగ్రాఫర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, తెలుగు, ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌, జడ్జి పోస్టులు, పర్సనల్ సెక్రటరీ, కోర్టు మాస్టర్‌ పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.