TG Assistant Professor Posts: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. పది రోజుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

|

Sep 26, 2024 | 2:33 PM

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. వైద్య ఆరోగ్యశాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించి, వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) భర్తీ ప్రక్రియ..

TG Assistant Professor Posts: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. పది రోజుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
TG Assistant Professor jobs
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. వైద్య ఆరోగ్యశాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించి, వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) భర్తీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ పోస్టులన్నింటినీ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న నేపథ్యంలో మరో 1,600 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల ద్వారా ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు స్పెషలిస్ట్‌ వైద్య సేవలు అందుబాటులో ఉండాలని భావిస్తూ 1600 పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపారు.

ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌ 2 పోస్టులకు వచ్చే నెల 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో 633 ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులకు అక్టోబరు 5 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు దరఖాస్తు వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అక్టోబరు 23వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 ఎంపికకు కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష నవంబరు 30న నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టర్‌ పరిధిలో 446 పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌లో 185 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 2 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియ వంద పాయింట్ల ఆధారంగా ఉంటుంది. ఇందులో 80 పాయింట్లు ప్రవేశ పరీక్షకు, మిగిలిన 20 ఇప్పటికే అందిస్తున్న ప్రభుత్వ వైద్యసేవల్లో అభ్యర్ధుల అనుభవానికి కేటాయిస్తారు.

నేటితో ముగుస్తున్న గేట్‌ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు

దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2025 దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగుస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ గుడువు సమయం ముగిసేలోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో గేట్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.