TS ePass Scholarship 2022 application last date: తెలంగాణ రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు మే 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. దరఖాస్తు గడువు మార్చి 31తో ముగిసినప్పటికీ వైద్యవిద్య, పారామెడికల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల సెట్ వివరాలు ఈ-పాస్ వెబ్‌సైట్లో నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు మే 21 వరకు దరఖాస్తు అవకాశాన్ని ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు వెల్లడించారు.
Also Read: