తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టింగులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 27వ తేదీలోగా పోస్టింగులు ఇస్తే.. దీనికి సంబంధించిన నియమాక ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 734, వైద్య విధానపరిషత్‌లో 209, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటికే ప్రకటించిన మెరిట్‌లిస్ట్ ఆధారంగా.. ఆయా విభాగాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయిస్తారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో రోజుకు 250 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఇలా మొత్తం 3 రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వైద్య విధాన పరిషత్ పోస్టులకు ఒక్క రోజులోనే కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగిస్తే.. ఈ నెలాఖరులోగా 4,461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యచరణ ప్రారంభిస్తుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.