TS Police Recruitment 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

|

May 20, 2022 | 7:42 PM

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు..

TS Police Recruitment 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Ts Police Recruitment
Follow us on

నిరుద్యోగ అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు సడలింపును ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును కూడా మరో 6 రోజుల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడవు ఇవాళ్టితో అంటే మే 20 నాటికి ముగుస్తోంది. దరఖాస్తులకు ఇవాళ ఆఖరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సర్వర్ మొరాయించడంతో కొన్ని చోట్ల అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా వయో పరిమితిని పొడిగించడంతో తమకు సమయం ఇవ్వాలని అనేక మంది నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. దీంతో స్పందించిన కేసీఆర్ సర్కార్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే.. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో మొత్తం 17, 291 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఖాళీలకు సంబంధించి నిన్నటి వరకు మొత్తం 5.2 లక్షల మంది అభ్యర్థులు 9.33 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఫోస్టులకు అప్లై చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటి వరకు 2.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.