TS EAPCET 2025 Results: తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. టాప్‌ ర్యాంకర్లు వీరే!

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ సారి ఎప్ సెట్ పరీక్షల్లో అబ్బాయిల హవా కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులలో అబ్బాయిలే తొలి స్థానాల్లో నిలిచారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు 9 ర్యాంకులు సాధించారు.

TS EAPCET 2025 Results: తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. టాప్‌ ర్యాంకర్లు వీరే!
TG EAPCET 2025

Edited By: Anand T

Updated on: May 11, 2025 | 12:49 PM

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కే నేరుగా ఫలితాలు వెళ్తాయ్‌. ర్యాంకులతో పాటు మార్కులు విడుదల చేశారు సీఎం రేవంత్. పరీక్షలు జరిగిన వారం రోజుల్లోనే ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్‌ 29 నుంచి మే 4వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పరీక్ష రాసిన 2లక్షల 7వేల మంది రాయగా.. అగ్రి, ఫార్మా విభాగాల్లో పరీక్ష రాసిన 81వేల మంది విద్యార్థులు రాశారు. ఇక ఇవాళ విడుదలైన ఎప్ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 73.29 శాతం ఉత్తీర్ణతతో 1,51,779 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 87.82 శాతం ఉత్తీర్ణతతో 71,309 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

అబ్బాయిలదే హవా.. టాపర్స్ వీరే
అయితే, ఈసారి తెలంగాణ ఎప్ సెట్ పరీక్షల్లో అబ్బాయిలే హవా కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులలో అబ్బాయిలే తొలి స్థానాల్లో నిలిచారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు 9 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌లో టాపర్‌గా ఏపీకి చెందిన భరత్‌చంద్ర, అగ్రి, ఫార్మా టాపర్‌గా మేడ్చల్‌కు చెందిన సాకేత్‌ నిలిచారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులు..

  •  భరత్ చంద్ర – ఆంధ్రప్రదేశ్ మార్కులు 150.05
  •  రామ చరణ్ రెడ్డి – హైదరాబాద్ – మార్కులు 148.28
  •  హేమ సాయి సూర్య కార్తిక్ – విజయనగరం ఏపీ – 147.08
  •  లక్ష్మి భార్గవ్ – హైదరాబాద్ – 146.15
  •  వెంకట గణేశ్ – హైదరాబాద్ – 144.05
  •  సాయి రిషంత్ రెడ్డి – హైదరాబాద్ – 143.72
  •  రుష్మిత్ – హైదరాబాద్ – 142.58
  •  బని బ్రాట మాజీ – హైదరాబాద్ – 141.08
  •  ధనుష్ రెడ్డి – హైదరాబాద్ – 140.24
  •  శ్రీ కార్తిక్ – హైదరాబాద్ – 138.25

అగ్రి కల్చర్ ఫార్మా విభాగం టాప్ 5..

  • సాకేత్ రెడ్డి – హైదరాబాద్ – 141.69
  • లలిత్ వారెన్య – కరీంనగర్ – 140.48
  • అక్షిత్ – వరంగల్ – 140
  •  సాయిచంద్ – వనపర్తి – 138.82
  •  బ్రాహ్మణి – హైదరాబాద్ – 138.71

మరోవైపు రెండు రోజుల్లోనే ఎప్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహకాలు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.