హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఈ క్యాలెండర్ అమలు అవుతుందని బోర్డు స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండగా.. 75 రోజులు సెలవులు వచ్చాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలు పూర్తైన విద్యార్ధులకు (2023-24) మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంటర్ బోర్డు ప్రకటించిన అన్ని సెలవులతోపాటు అన్ని ఆదివారాలు, రాష్ట్ర ప్రభుత్వ సెలవులను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. బోర్డు ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్‌కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు జరగాలని ఆమె తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.