TS 10th Exams 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష 2023ల విధానంలో మార్పు.. క్వశ్చన్‌ పేపర్‌ ప్యాట్రన్ ఎలా ఉంటుందంటే..

|

Jan 12, 2023 | 12:57 PM

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రశ్నపత్రాల్లో ఎస్సే ప్రశ్నల సెక్షన్‌లో ఇంటర్నల్ ఛాయిస్ తొలగించి.. ఛాయిస్‌ ప్రశ్నలను..

TS 10th Exams 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష 2023ల విధానంలో మార్పు.. క్వశ్చన్‌ పేపర్‌ ప్యాట్రన్ ఎలా ఉంటుందంటే..
TS Question paper Pattern
Follow us on

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రశ్నపత్రాల్లో ఎస్సే ప్రశ్నల సెక్షన్‌లో ఇంటర్నల్ ఛాయిస్ తొలగించి.. ఛాయిస్‌ ప్రశ్నలను పెంచారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే.. వాటిల్లో ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాస్తే సరిపోయేలా మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు టెన్త్‌ పరీక్షల క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌ను తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ జ‌న‌వ‌రి 11 (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనైతే క్వశ్చన్‌ పేపర్‌లో ప్రతి సెక్షన్‌లో ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉండేది. అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలిస్తారు. వాటిల్లో ఏదో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు రాయవల్సి ఉంటుంది.

ఐతే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమవ్వడం మూలంగా విద్యార్ధుల్లో అభ్యసన సామర్థ్యాలు తగ్గాయని, పరీక్షల విధానంలో మార్పులు చేసి ఛాయిస్‌ పెంచాలని ఉపాధ్యాయులు కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ తాజాగా ఇంటర్నల్‌ ఛాయిస్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మిగిలిన సబ్జెక్టులైన గణితం, సైన్స్‌, సోషల్‌కు మాత్రమే మారిన విధానంలో క్వశ్చన్‌ పేపర్ ఇస్తారు. ఈ ఏడాది (2023) ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి కూడా ఈ విధానమే వర్తిస్తుందని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తొమ్మిదో తరగతి పరీక్షలు కూడా ఈ విధానంలోనే జరుగుతాయి.

తెలంగాణ టెన్త్‌-2023 క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌ ఇలా ఉంటుంది..

  • ఎస్సే ప్రశ్నలు 6 ఇస్తారు.. వాటిల్లో ఏవైనా 4 రాయాలి. ఒక్కో ప్రశ్నకు 6 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు ఉంటాయి.
  • లఘు ప్రశ్నలు 6 ఇస్తారు.. ఆరింటికీ సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు ఉంటాయి.
  • అతి లఘు ప్రశ్నలు 6 ఇస్తారు.. ఆరింటికీ సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 12 మార్కులు ఉంటాయి.
  • మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు 20 ఇస్తారు. 20 ప్రశ్నలకు ఒక్కోమార్కు చొప్పున 20 మార్కులు కేటాయిస్తారు.

మొత్తం 80 మార్కులకు 36 ప్రశ్నలు ఇస్తారు. 36 ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.