Jobs Alert: నిరుద్యోగులకు శుభవార్త.. రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీగా టీచర్ ఉద్యోగాలు.. ఎన్ని ఖాళీలంటే..

|

Mar 30, 2021 | 8:25 AM

Jobs Alert: నిరుద్యోగులకు శుభవార్త దేశ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షన్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్..

Jobs Alert: నిరుద్యోగులకు శుభవార్త.. రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీగా టీచర్ ఉద్యోగాలు.. ఎన్ని ఖాళీలంటే..
Jobs
Follow us on

Jobs Alert: నిరుద్యోగులకు శుభవార్త దేశ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షన్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 3,479 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యూయేట్ చీటర్(టీజీటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ప్రకటించింది. దరఖాస్తులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు ఉంటుంది. జూన్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 3,479 పోస్టులుండగా.. వీటిలో తెలంగాణలో 262 పోస్టులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు, విద్యార్హత, అనుభవం తదితర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌ https://tribal.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

సంక్షిప్తంగా..
మొత్తం ఖాళీలు: 3,479
పోస్టులు: ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీచర్).
తెలంగాణలో ఖాళీలు: 262
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 117
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 01/04/2021
దరఖాస్తుకు చివరి తేదీ: 30/04/2021
పరీక్ష తేదీ: జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Also read:

Fights Diverted: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమస్య.. గాలిలో చెక్కర్లు కొడుతున్న విమానాలు.. ఎందుకంటే..!‌

Humanity is Still Alive: చిత్రం చెప్పిన విశేషం.. నడవలేని శునకంపై కరుణ చూపిన గ్రామీణ డాక్టర్.. పిక్ సోషల్ మీడియాలో వైరల్

Karthika Deepam 1000 Episode: ఈరోజు ఉత్కంఠంగా మారిన కార్తీక్ దీపం .. దీప, పిల్లల వద్దకు చేరుకున్న డాక్టర్ బాబు