TATA Memorial Centre: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..

|

Jun 27, 2021 | 4:53 PM

TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియ‌ర్ రెసిడెంట్‌లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో...

TATA Memorial Centre: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..
Tata Memorial
Follow us on

TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియ‌ర్ రెసిడెంట్‌లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 64 పోస్టులను రిక్రూట్ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (28-06-2021)తో ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 64 ఖాళీల‌కు గాను.. సీనియ‌ర్ రెసిడెంట్ అన‌స్థీషియాల‌జీ (7), బ‌యోకెమెస్ట్రీ (2), డెంట‌ల్ అండ్ ప్రొస్థ‌టిక్స్ స‌ర్జ‌రీ (1), హెడ్ అండ్ నెక్ ఆంకాల‌జీ (4), హెమ‌టోపాథాల‌జీ (2), మెడిక‌ల్ ఆఫీస‌ర్ మెడిక‌ల్ ఆంకాల‌జీ (7), మైక్రోబ‌యాల‌జీ (2), న్యూక్లియ‌ర్ మెడిసిన్ (2), ప‌ల్లియ‌టివ్ మెడిసిన్ (2), పాథాల‌జీ (7), పీడియాట్రిక్ ఆంకాల‌జీ (7), పీడియాట్రిక్ స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ (1), ప్రివెంటివ్ ఆంకాలజీ (2), రేడియేష‌న్ ఆంకాల‌జీ (7), రేడియో డయాగ్నోసిస్ (6), స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ (7), ట్రాన్స్‌ఫ్యూష‌న్ మెడిసిన్ (2) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
* పైన తెలిపిన ఖాళీల‌ను అనుస‌రించి అభ్య‌ర్థులు.. సంబంధిత విభాగాల్లో ఎండీ, డీఎన్‌బీ చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (28-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల‌కు https://tmc.gov.in/index.php/en/ ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: IGNOU ADMISSION 2021: ఉర్దూలో మాస్టర్స్ కోర్సును ప్రారంభించిన ఇగ్నో..! దూరవిద్య కింద అందుబాటులోకి..

ICMR Recruitment 2021: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Kits Warangal Faculty: వ‌రంగ‌ల్ కిట్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. అర్హులెవ‌రు? ఎలా ద‌రాఖాస్తు చేసుకోవాలి..