IIT Madras: ఐఐటీలో చదవాలంటే సీటు రావాల్సిన అవసరం లేదు.. మద్రాస్‌ క్యాంపస్‌ వినూత్న నిర్ణయం..

|

May 07, 2022 | 7:28 AM

IIT Madras: ఐఐటీలో సీటు సాధించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చిన్ననాటి నుంచి కష్టపడుతుంటారు. ఐఐటీలో సీటు సంపాదించుకుంటే చాలు లైఫ్‌ సెట్ అయినట్లేనని సగటు ఇండియన్‌ పేరెంట్స్‌ భావిస్తుంటారు. అందుకే స్కూల్‌ ఏజ్‌ నుంచే ఐఐటీ ఫౌండేషన్స్‌లో చదివిస్తుంటారు...

IIT Madras: ఐఐటీలో చదవాలంటే సీటు రావాల్సిన అవసరం లేదు.. మద్రాస్‌ క్యాంపస్‌ వినూత్న నిర్ణయం..
Iit Madras
Follow us on

IIT Madras: ఐఐటీలో సీటు సాధించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చిన్ననాటి నుంచి కష్టపడుతుంటారు. ఐఐటీలో సీటు సంపాదించుకుంటే చాలు లైఫ్‌ సెట్ అయినట్లేనని సగటు ఇండియన్‌ పేరెంట్స్‌ భావిస్తుంటారు. అందుకే స్కూల్‌ ఏజ్‌ నుంచే ఐఐటీ ఫౌండేషన్స్‌లో చదివిస్తుంటారు. అయితే టఫ్‌ కాంపిటేషన్‌ కారణంగా సీటు దక్కించుకోండం అంత సులభమైన విషయమేమి కాదు. దీంతో చేసేదేమి లేక ఇతర విద్యా సంస్థల్లో చదువుతుంటారు. అయితే ఐఐటీ క్యాంపస్‌లో చదవాలన్న ఆశ ఉండి, సీటు రాని వారి కోసం ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఐఐటీలో బోధించే విద్యను ఎవరైనా వినే సదుపాయాన్ని కల్పించింది.

ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ప్రొఫెసర్లు చెప్పిన క్లాసులకు సంబంధించి వీడియోలు, మెటీరియల్‌ను దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థి అయినా ఉచితంగా యాక్సెస్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. విద్యార్థులకు కోసం http://nsm.iitm.ac.in/cse/ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా సమయంలో విద్యార్థులకు బోధించిన క్లాస్‌లకు సంబంధించిన వీడియోలను ఈ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ విషయమై ఐఐటీ మద్రాస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ‘కోర్ సబ్జెక్టుల‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవ‌డంతో పాటు సులువుగా దాన్ని నేర్చుకునేందుకు ఈ క్లాసులు ఎంత‌గానో ఉపయోగపడతాయి. ఐఐటీలో చ‌ద‌వ‌లేని విద్యార్థుల‌కు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల‌కు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం’ అని చెప్పుకొచ్చారు. ఐఐటీ మద్రాస్‌ చేసిన ఈ ఆలోచన నిజంగానే భేష్‌ కదూ.!

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: SIP: సిప్‌ అంటే నెలనెలా పెట్టుబడి పెట్టడమేనా.. రోజువారీగా ఇన్వెస్ట్‌ చేయలేమా..

Summer effect: పెళ్లి కొడుకు ఐడియా అదుర్స్.. సమ్మర్‌లో కూల్‌ కూల్‌.. వీడియో చూస్తే..

Sleeping Effects: తక్కువగా నిద్రపోతున్నారా?.. నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..!