SSC GD Constable: పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 22,424 కానిస్టేబుల్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే.

|

Aug 10, 2021 | 9:40 AM

SSC GD Constable Recruitment 2021: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌...

SSC GD Constable: పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 22,424 కానిస్టేబుల్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే.
Ssc Gd Constable
Follow us on

SSC GD Constable Recruitment 2021: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా జరగనున్న ఈ నియామకంలో భాగంగా ఏకంగా 25, 271 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు 2847 పోస్టులున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అప్లై చేసుకునే అభ్యర్థులు పురుషులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
* ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం అందిస్తారు.
* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష , ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 17న ప్రారంభం కాగా ఆగస్టు 31న ముగియనుంది.
* పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ICMR – NIV Recruitment: ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Basara IIIT Notification: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎలా భర్తీ చేయనున్నారో తెలుసా?

MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.