
ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి అన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు/కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ తదితరులకు అర్హతలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా పీఈ అండ్ ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.