SCR Jobs: మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 27న మొదలు కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను కేవలం మూడు నెలల కాంట్రక్ట్ విధానం ద్వారా తీసుకుంటున్నారు. ఎంపికైన అభ్యర్థులు జూన్ 30 వరకు మాత్రమే సేవలు అందించాల్సి ఉంటుంది.
స్పెషలిస్ట్ డాక్టర్ – 1
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టిషియనర్స్ – 13
నర్సింగ్ సిస్టర్స్ – 21
ఫార్మసిస్ట్ – 2
హాస్పిటల్ అటెన్‌డంట్స్ – 23
ఈ పోస్టులకు విద్యార్హతలు, జీతం వంటి పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని వారు అర్హతలు ఆధారంగా వారి వారి మొబైళ్లకు, మెయిల్ ఐడీలకు ఇంటర్వ్యూ తేదీ, సమయాలను మెసేజ్ రూపంలో అందిస్తారు.