
సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. వివిధ స్ట్రీమ్‌లలో ఆఫీసర్ గ్రేడ్ ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 110 ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులు భర్తీ చేయనుంది. సీఏ, సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, లా డిగ్రీ ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.వివరాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎస్, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయో పరిమితి సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షలు (ఫేజ్1, ఫేజ్ 2), ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.62,500 నుంచి రూ.1,26,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీలు, ఫీజు చెల్లింపు చివరి తేదీ, పరీక్ష తేదీలు, సిలబస్, దరఖాస్తు చివరి తేదీలను త్వరలో విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.