SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

|

May 28, 2022 | 6:15 AM

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ సంస్థ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో పలు పోస్టులను...

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Follow us on

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ సంస్థ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను రెగ్యులర్‌ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుని అనుసరించి సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల ప్రక్రియ 27-05-2022న మొదలుకాగా చివరి తేదీగా 16-06-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..