Government Jobs 2023: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.

|

Dec 19, 2022 | 4:51 PM

స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే ఈ మహరత్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పశ్చిమ బెంగాలోని బర్న్‌పుర్‌లో ఉన్న సంస్థ ఆధ్వర్యంలోని ఐఐఎస్‌సీఓ..

Government Jobs 2023: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.
Sail Jobs
Follow us on

SAIL Recruitment: స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే ఈ మహరత్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పశ్చిమ బెంగాలోని బర్న్‌పుర్‌లో ఉన్న సంస్థ ఆధ్వర్యంలోని ఐఐఎస్‌సీఓ స్టీల్‌ ప్లాంట్‌ ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 158 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అసిస్టెంట్ మేనేజర్ (06), మేనేజర్ (04), మెడికల్ ఆఫీసర్ (05), కన్సల్టెంట్ (10), ఆపరేటర్-కమ్ టెక్నీషియన్ (86), అటెండెంట్-కమ్ టెక్నీషియన్ (47) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎస్సెస్సీ/ ఐటీఐ/ ఎన్‌సీడీటీ/ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డీఎన్‌బీ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 228 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,070 నుంచి రూ. 2.2 లక్షల వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 20-12-2022న మొదలై 10-01-2023తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..