SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగావకాశాలు.. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యం..

|

Jul 25, 2022 | 3:56 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ కన్సల్టెంట్, యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల (Junior Consultant Posts) భర్తీకి..

SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగావకాశాలు.. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యం..
Sai
Follow us on

SAI Junior Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ కన్సల్టెంట్, యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల (Junior Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: కోచ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: కన్సల్టెంట్, యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ ఇంజనీరింగ్‌, ఎంబీఏ/పీజీడీఎం/బీఈ/బీటెక్‌/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాతీయ/ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.