RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
RRC SECR Apprentice Recruitment

Updated on: May 06, 2026 | 2:25 PM

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR).. 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1644 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో రాయ్‌పుర్‌ డివిజన్‌లో 1363 ఖాళీలు, వేగన్‌ రాయ్‌పుర్‌ షాప్‌లో 281 వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సీఓసీఏ, మెషినిస్ట్, టర్నర్ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • డీఆర్‌ఎం ఆఫీసర్‌, రాయ్‌పుర్‌ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 1363
  • వేగన్‌ రిపేర్‌షాప్‌, రాయ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 281

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మే 5, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 4, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే పదో తగరతిలో వచ్చిన మార్కులు, ఐటీఐ అర్హత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది వరకు అప్రెంటీస్‌ శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతి నెలా నిబంధనల మేరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us