Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక

RRC North Eastern Railway Sports Quota Recruitment 2025 Notification: రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC).. నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద లెవెల్‌-1, 2, 3, 4, 5 (గ్రూప్‌‘సి’, ‘డి’) వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు..

Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక
RRC North Eastern Railway Sports Quota Jobs

Updated on: Nov 04, 2025 | 8:59 AM

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC).. నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద లెవెల్‌-1, 2, 3, 4, 5 (గ్రూప్‌‘సి’, ‘డి’) వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు నవంబర్‌ 10, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిగ్రీలో అర్హత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అథ్లెటిక్స్, రెస్లింగ్‌, హ్యండ్‌బాల్‌, ఫుడ్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్, బాక్సింగ్‌, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, హాకీ, స్విమ్మింగ్.. వంటి తదితర క్రీడల్లో పాల్గొనడం లేదంటే పతకాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 10, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా రైల్వే ఉద్యోగాల 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.