
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ (CEN No.03/2026) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 14, 2026వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్/ ఎక్స్‌సర్వీస్‌మెన్/ దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. కేవలం సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT), ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ఆర్‌ఆర్‌బీ రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.