
హైదరాబాద్, మార్చి 22: భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్ రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని పొందుపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతో పాటు క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్‌షీట్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ అందుబాటులో ఉంచింది.
ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష ప్రాథమిక కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి మార్చి 21 నుంచి 29వ తేదీ వరకు తెలుపవచ్చని బోర్డు తెలిపింది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్ కీని రూపొందిస్తారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. కాగా మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 434 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష ప్రాథమిక కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.