RRB NTPC 2025 Admit Card: మరో 2 రోజుల్లోనే RRB NTPC 2025 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మరో కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఇటీవల సీబీటీ 2 పరీక్ష ఫలితాలు వెల్లడించిన ఆర్‌ఆర్‌బీ.. మరో రెండు రోజుల్లో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)..

RRB NTPC 2025 Admit Card: మరో 2 రోజుల్లోనే RRB NTPC 2025 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
RRB NTPC Admit Card

Updated on: Dec 26, 2025 | 3:40 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మరో కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఇటీవల సీబీటీ 2 పరీక్ష ఫలితాలు వెల్లడించిన ఆర్‌ఆర్‌బీ.. మరో రెండు రోజుల్లో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST) పరీక్షలను నిర్వహించనుంది. ఈ క్రమంలో ఆయా పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సీబీటీ 2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in నుంచి CBAT, CBTST పరీక్షల హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంఆది. కాగా సీబీటీ2 పరీక్షలో మొత్తం 43,957 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఆర్‌ఆర్‌బీ ఓ ప్రకటనలో తెలిపింది. వీరందరికీ డిసెంబర్ 28న ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జనవరి 4న XAT 2026 రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదల

జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎక్స్‌ఏటీ) 2026 ప్రవేశ పరీక్ష మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 4న గ్జాట్ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనునంది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు, పార్టిసిపేటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. 2026 ఏడాదికి గ్జాట్‌ పరీక్షను జంషెడ్‌పూర్‌లోని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఎక్స్‌ఏటీ 2026 ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.