
హైదరాబాద్, మే 13: ఆర్‌ఆర్‌బీ జేఈ సీబీటీ 1 పరీక్షను ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని మార్చి 5, 2026న విడుదల చేశారు. అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అయి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీబీటీ 1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నియామక ప్రక్రియలోని తదుపరి దశ అయిన CBT 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులవుతారు. CBT 1 కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని, తుది మెరిట్ జాబితా తయారీకి CBT 2 స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారని RRB స్పష్టం చేసింది. సీబీటీ 2 పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ వివరాలు, 4 రోజుల ముందు ఈ-కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు పరీక్షలను ఒకే ఉమ్మడి మార్కింగ్ విధానంతో, ఆబ్జెక్టివ్ తరహా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తారు. కాగా ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ కింద డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులను భర్తీ చేస్తారు.
ఆర్‌ఆర్‌బీ జేఈ సీబీటీ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఏపీఆర్ఎస్) ఐదో తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికై విద్యార్ధుల జాబితాను అందుబాటులో ఉంచింది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, జూనియర్ ఇంటర్ (ఏపీఆర్‌జేసీ), డిగ్రీ (ఏపీఆర్‌డీసీ) కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 24న మొత్తం 7,569 సీట్లకు పరీక్ష నిర్వహించగా 66,300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. మే 15 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్‌లు నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.