RMLIMS Jobs 2022: రూ.2 లక్షల జీతంతో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనున్న లఖ్‌నవూలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌.. 18 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

RMLIMS Jobs 2022: రూ.2 లక్షల జీతంతో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..
RMLIMS Lucknow

Updated on: Oct 11, 2022 | 8:38 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనున్న లఖ్‌నవూలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌.. 18 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ(నర్సింగ్‌)/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ(నర్సింగ్)/ఎంఎస్సీ(నర్సింగ్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 2022వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ మూడో వారంలో ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1180లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/వికలాంగ అభ్యర్ధులు రూ.708లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.47,600ల నుంచి రూ.2,16,600ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్ పోస్టులు: 1
  • వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్ పోస్టులు: 1
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 4
  • ట్యూటర్ పోస్టులు: 10

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us