General category seats: మెరిట్‌ చూపిన ఓబీసీలను కూడా జనరల్ కేటగిరీలోకి తీసుకోవాలి: సుప్రీంకోర్టు

|

Apr 29, 2022 | 4:44 PM

జనరల్‌ కేటగిరిలోని చివరి అభ్యర్థుల కంటే ఇతర వెనుకబడిన తరగతి (OBC) అభ్యర్థులు ఎక్కువ ప్రతిభ చూపితే.. వారిని జనరల్‌ విభాగంలోనే సర్దుబాటు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం (ఏప్రిల్‌ 28) పేర్కొంది..

General category seats: మెరిట్‌ చూపిన ఓబీసీలను కూడా జనరల్ కేటగిరీలోకి తీసుకోవాలి: సుప్రీంకోర్టు
Supreme Court
Follow us on

Quota candidates with more marks are entitled to general category seats: జనరల్‌ కేటగిరిలోని చివరి అభ్యర్థుల కంటే ఇతర వెనుకబడిన తరగతి (OBC) అభ్యర్థులు ఎక్కువ ప్రతిభ చూపితే.. వారిని జనరల్‌ విభాగంలోనే సర్దుబాటు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం (ఏప్రిల్‌ 28) పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్‌డ్ కేటగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు వ్యతిరేకంగా ఓబీసీ అభ్యర్థుల నియామకాలను పరిగణించకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జనరల్‌ విభాగంలో వారిని భర్తీ చేసిన తర్వాత.. రిజర్వుడు విభాగంలో మిగిలిన సీట్లను కూడా మెరిట్‌ ఆధారంగా తిరిగి రిజర్వేషన్‌ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇందిరా సాహ్నీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1992) కేసుతో పాటు గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం ఏప్రిల్‌ 28న ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఓబీసీ అభ్యర్థుల వినతికి వ్యతిరేకంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘‘పిటిషన్‌లో పేర్కొన్న అలోక్‌ కుమార్, దినేష్‌ కుమార్‌లను సర్వీసు కేటాయింపులో జనరల్‌ విభాగంలోనే సర్దుబాటు చేయాలి. ఎందుకంటే వారు జనరల్‌ విభాగంలోని చివరి అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రతిభ కలిగినవారు. వారి నియామకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వ్‌ విభాగంలోని సీట్లగా పరిగణనలోకి తీసుకోకూడదు’’ అని ధర్మాసనం తెలిపింది.

Also Read:

TS SSC Exams 2022: మే 23 నుంచి ప్రారంభంకానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే..