
చెన్నైలొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 11వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి విజిట్ పర్ అవర్‌కు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి..
Director, Human Resource Management Department (Recruitment Section), Reserve Bank of India, Fort Glacis, 16, Rajaji Salai, Chennai – 600 001
(రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్ట్ గ్లాసిస్, 16, రాజాజి సలాయ్, చెన్నై-600001)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.