Railway Recruitment 2021: ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ సమయంలో ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాలలో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇక రైల్వే శాఖలో కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 520 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయితే ఎంపికైన వారు కోల్‌కతా కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 520
జనరల్ 277, ఎస్టీ 30, ఎస్సీ 126, ఓబీసీ 87 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 42 ఏళ్లలోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది.
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్‌సైట్:https://www.rrcser.co.in
ఇవి కూడా చదవండి: