Breaking! టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఎప్పుడు?.. ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (VRS)కు ఎంత మంది నమోదు చేసుకున్నారంటే..

Breaking! టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఎప్పుడు?.. ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు..
Tsrtc Md Sajjanar

Updated on: Mar 30, 2022 | 1:20 PM

Voluntary Retirement Scheme TS RTC Employees: తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (VRS)కు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని ఎండీ సజ్జనార్‌ (TSRTC MD Sajjanar) తెలిపారు. వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను ఎవరినీ బలవంతం చేయట్లేదు. ఎంతమంది ఉద్యోగులు విఆర్ఎస్ కు నమోదు చేసుకుంటారనే దానిని బట్టి, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌ సంఖ్య ఆధారంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్యాకేజి సిద్ధం చేస్తాం. వీఆర్‌ఎస్‌ తేల్చాక ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సజ్జనార్‌ ఈ రోజు (మార్చి 30) మీడియాకు తెలిపారు. మరోవైపు ఉప్పల్ నుంచి యాదాద్రికి మినీ బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ప్రారంభించారు. టెకెట్‌ ధర జేబీఎస్‌ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఉండనున్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు.

Also Read:

IAS Tina Dabi: రెండో పెళ్లి చేసుకోనున్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా దాబి! ఫుల్ లైఫ్ స్టోరీ ఇదే..