JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో

JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
JEE Main Paper 2 Answer Key

Updated on: Feb 20, 2026 | 3:29 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే ఇందులో పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల జనవరి 29న జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీతో పాటు విద్యార్ధుల రెస్పాన్స్‌ షీట్‌లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

దీనిపై ఫిబ్రవరి 19 నుంచి 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఎన్టీయే తన ప్రకటనలో తెలిపింది. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తాలని భావిస్తే ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, కేవలం ఆన్‌లైన్‌ విధానంలోనే వీటిని స్వీకరిస్తామని పేర్కొంది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫైనల్ ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2026 పేపర్‌ 2 ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల 2026 టైం టేబుల్‌ విడుదల

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) పరిధిలోని పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తామని టాస్‌ సంచాలకుడు పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us