విమానాల్లో నీట్‌ క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఉదయం 11 గంటలకే తెరచుకున్న NEET 2026 పరీక్ష కేంద్రాలు..

నీట్ యూజీ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు జారీ చేసింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నేడు నీట్ పరీక్ష రాయనున్నారు. అవకతవకలకు తావులేకుండా సీసీటీవీ నిఘా, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..

విమానాల్లో నీట్‌ క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఉదయం 11 గంటలకే తెరచుకున్న NEET 2026 పరీక్ష కేంద్రాలు..
NEET re Exam

Updated on: Jun 21, 2026 | 11:22 AM

హైదరాబాద్‌, జూన్‌ 21: నేడు NEET (UG) 2026 పరీక్ష రాసే విద్యార్ధులకు NTA కీలక సూచనలు చేసింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉదయం 11 గంటల నుంచే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అభ్యర్ధులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించింది. నిషేధిత వస్తువులకు అనుమతి లేదు. ట్రాఫిక్ దృష్ట్యా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.

పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలు లేకుండా చర్యలు దేశవ్యాప్తంగా నేడు నీట్ రీ- టెస్ట్ నిర్వహించేందుకు సైనిక విమానాల్లో ప్రశ్నాపత్రాలు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో పరీక్ష జరగనుంది. వికలాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష రాయనున్న 22.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. నీట్ రీ-ఎగ్జామ్ కోసం 2 లక్షలకు పైగా సిబ్బంది, 674 మంది సిటీ కోఆర్డినేటర్లు రంగంలోకి దిగారు. లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.

టెక్నికల్ సమస్యల వల్ల బయోమెట్రిక్ కాకపోయినా పరీక్షకు అనుమతి ఇవ్వనున్నారు. లిఖితపూర్వక హామీ పత్రం, మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్ష కోసం విద్యుత్ బ్యాకప్, ఫ్యాన్లు, త్రాగునీరు , మెడికల్ సపోర్ట్ ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్ధులకు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 దాటితే గేట్లు క్లోజ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నో ఎంట్రీ. అభ్యర్థులు పారదర్శకమైన వాటర్ బాటిల్స్ మాత్రమే తెచ్చుకోవాలి. మొబైల్స్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, నగలకు పూర్తి నిషేధం. క్వశ్చన్ పేపర్ లీక్ రూమర్లను నమ్మవద్దు. తప్పుడు ప్రచారాలపై సైబర్ క్రైమ్, సీబీఐకి ఎన్టీఏ ఫిర్యాదు చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us