NPCIL Recruitment: నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగాలు.. ఐటీఐ మొదలు డిగ్రీ వరకు అర్హులు..

|

Dec 14, 2022 | 8:03 PM

నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నరోరాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్‌) పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

NPCIL Recruitment: నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగాలు.. ఐటీఐ మొదలు డిగ్రీ వరకు అర్హులు..
Npcil Recruitment
Follow us on

నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నరోరాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్‌) పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 89 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 89 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నర్సు-ఎ (04), స్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ (కేటగిరీ-1)(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) (28), ఫార్మసిస్ట్-బి (01), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (టెక్నీషియన్-బి) (01), స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (కేటగిరీ-2)(ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) (32), అసిస్టెంట్ గ్రేడ్-1(హెచ్‌ఆర్‌) (08), అసిస్టెంట్ గ్రేడ్-1(ఎఫ్‌&ఎ) (03), అసిస్టెంట్ గ్రేడ్-1(సి&ఎంఎం) (07), స్టెనో గ్రేడ్-1 (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, పన్నెండో తరగతి, డిప్లొమా, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్), డిగ్రీ, ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 06-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..